ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ చందాదారుల నగదు ఉపసంహరణ పరిమితి పెంపు !

Telugu Lo Computer
0


ద్యోగుల భవిష్య నిధి సంస్థ చందాదారుల నగదు ఉపసంహరణ విషయంలో వైద్య ఖర్చుల కోసం చేసే 68జే క్లెయిమ్‌ల అర్హత పరిమితిని రూ. 50,000 నుంచి రూ.1 లక్షకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈపీఎఫ్‌వో కొత్త మార్పు ప్రకారం.. చందాదారులు తమ వ్యక్తిగత లేదా కుటుంబ సభ్యుల వైద్య చికిత్స ఖర్చుల కోసం ఇకపై రూ.1 లక్ష వరకూ ఉపసంహరించుకోవచ్చు. నెల అంతకంటే ఎక్కువ రోజులు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నా, ఆపరేషన్లు చేయించుకున్నా క్లెయిమ్‌ చేయొచ్చు. పక్షవాతం, టీబీ, క్షయ, క్యాన్సర్‌, గుండె సంబంధిత చికిత్స కోసం కూడా నగదు విత్‌డ్రాకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ. లక్ష పరిమితికి లోబడి ఉద్యోగుల ఆరు నెలల బేసిక్ వేతనంతోపాటు డీఏ లేదా ఈపీఎఫ్‌లో ఉద్యోగి వాటా వడ్డీతో సహా ఏది తక్కువైతే అంత వరకూ మాత్రమే ఉపసంహరించుకోవడానికి క్లెయిమ్ చేయడానికి వీలుంటుంది. ఇందు కోసం ఎలాంటి మెడికల్‌ సర్టిఫికెట్లు లేకుండా సెల్ఫ్‌ డిక్లరేషన్‌ సమర్పించి దరఖాస్తు చేసుకోవచ్చు.

Post a Comment

0Comments

Post a Comment (0)