నిలకడగా ఉన్న బంగారం, వెండి ధరలు !

Telugu Lo Computer
0


రెండు రోజులుగా రూ.500 తగ్గిన బంగారం సోమవారం స్థిరంగా కొనసాగాయి. పెళ్లిళ్ల జోరు ఉండడంతో బంగారం కొనుగోలుపై ఆసక్తి చూపుతారని తెలుస్తోంది. అంతర్జాతీయంగా బంగారం ధరలు స్పాట గోల్డ్ ఔన్స్ కు 2340 డాలర్లుగా నమోదయింది. స్పాట్ సిల్వర్ రేటు 28 డాలర్లుగా ఉంది. దేశీయంగా బంగారం, వెండి ఏప్రిల్ 22న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,050గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.74,250 గా ఉంది. ఏప్రిల్ 21న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.68,050తో విక్రయించారు. 10 గ్రాముల బంగారానికి ఆదివారంతో పోలిస్తే సోమవారం ధరల్లో ఎటువంటి మార్పులు లేవు. న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,210 ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ రూ.74,390 గా నమోదైంది.ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.68,050 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.74,250 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.68,850 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.74,110తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.68,050 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.74,250తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.68,050తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.74,250తో విక్రయిస్తున్నారు. బంగారం ధరలతో పాటు వెండి ధరలూ స్థిరంగానే కొనసాగాయి. సోమవారం ఓవరాల్ గా కిలో వెండి రూ.86,500గా నమోదైంది. ఆదివారంతో పోలిస్తే సోమవారం ధరల్లో ఎటువంటి మార్పులు లేవు. న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.86,500గా ఉంది. ముంబైలో రూ.86,500, చెన్నైలో రూ.89,900, బెంగుళూరులో 86,100, హైదరాబాద్ లో రూ.89,900తో విక్రయిస్తున్నారు.


إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)