హైదరాబాద్‌లో చల్లబడిన వాతావరణం !

Telugu Lo Computer
0


తెలంగాణలో నాలుగు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.  ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పింది. ఈ మేరకు నాలుగు రోజుల పాటు పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. గురువారం నుంచి ఆదివారం వరకు ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్‌లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 36-26 డిగ్రీల మధ్య ఉండే అవకాశం ఉందని పేర్కొంది. ఉపరితల గాలులు ఆగ్నేయ దిశ నుంచి వీచే అవకాశం ఉందని తెలిపింది. ఇదిలా ఉండగా.. మొన్నటి వరకు ఎండలు దంచికొట్టగా.. వడగాలులతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గురువారం ఉదయం నుంచి నగరంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఆకాశం మేఘావృతమై ఉండగా.. చల్లటి గాలులు వీస్తుండడంతో నగరవాసులకు ఊరట కలిగించినట్లయ్యింది.

Post a Comment

0Comments

Post a Comment (0)