కాషాయం రంగులోకి దూరదర్శన్‌ న్యూస్‌ లోగో ?

Telugu Lo Computer
0


న్నికల ముందు దూరదర్శన్‌ న్యూస్‌ లోగో కాషాయ రంగులోకి మారిపోయింది. గతంలో రూబీ రెడ్‌ కలర్‌లో లోగో కనిపించేంది. అయితే పునరుద్ధరణలో లోగో కాషాయ రంగులో అందుబాటులో ఉంటుందని దూరదర్శన్‌ అధికారిక ప్రకటనలో పేర్కొంది. "మునుపెన్నడూ లేని విధంగా వార్తల ప్రయాణానికి సిద్ధంగా ఉండండి. సరికొత్త డిడి వార్తలను తెలుసుకోండి. వార్తలను వెల్లడించేందుకు మాకు ధైర్యం ఉంది. వేగంపై కచ్చితత్వం.. ఆరోపణలపై వాస్తవాలు .. సంచలనాత్మకమైన నిజాలు ఎందుకంటే ఇది డిడి న్యూస్‌.. ఇదే నిజం" అని దూరదర్శన్‌ అధికారిక చానెల్‌ ఎక్స్‌లో ట్వీట్‌ చేసింది. దూరదర్శన్ చర్యపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు కొన్ని గంటల ముందు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉండగా జాతీయ చానెల్‌, కేంద్ర ప్రభుత్వం లోగో కలర్‌ను తమ పార్టీ రంగులోకి ఎలా మారుస్తుందని ప్రశ్నిస్తున్నారు. ఇది ఎన్నికల ఉల్లంఘన కాదా, ఇసిఐ ప్రతినిధి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల ముందు తీవ్ర ఉల్లంఘన అని పలువురు తీవ్రంగా మండిపడుతున్నారు. "ప్రసార సమాచార మంత్రిత్వ శాఖ కానీ ఆర్‌ఎస్‌ఎస్‌ సమాచారం మాత్రమే" అని సోషల్‌ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో ప్రసార భారతి తన డిజిటల్‌ మీడియా బృందాన్ని బలోపేతం చేసింది. పబ్లిక్‌ బ్రాడ్‌ కాస్టర్‌కి 2025-2026 వరకు ప్రసార మౌలిక సదుపాయాలను పునరుద్దరణ, విస్తరించేందుకు రూ.2,539.61 కోట్లు కేటాయించింది. ఇది ఒటిటి ప్లాట్‌ఫామ్‌ను కూడా ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.


Post a Comment

0Comments

Post a Comment (0)