శని, ఆదివారాల్లో వడగాల్పులు ?

Telugu Lo Computer
0

దేశవ్యాప్తంగా చాలా  రాష్ట్రాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. శని, ఆదివారాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాల జాబితాను విడుదల చేసింది. ఒడిశా, గంగానది పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, విదర్భ, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక, రాయలసీమ, కోస్తా ఆంధ్ర ప్రదేశ్, యానాం, తెలంగాణల్లో శనివారం, ఆదివారం వడగాడ్పులు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తూర్పు మరియు ద్వీపకల్ప భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో రానున్న రెండు రోజుల్లో వేడిగాలులు వీస్తాయని వాతావరణ కార్యాలయం హెచ్చరించింది. ఇక ఏప్రిల్ 9 వరకు ఈశాన్య ప్రాంతంలో తీవ్రమైన వర్షాలు, ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, గంగానది పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే రాబోయే ఏడు రోజుల్లో పశ్చిమ బెంగాల్, సిక్కింలో తేలికపాటి లేదా మోస్తరు వర్షాలు కురిసే ఛాన్సుందని తెలిపింది. అలాగే ఉరుములు, మెరుపులతో వర్షం పడే అవకాశం ఉందని చెప్పింది.

Post a Comment

0Comments

Post a Comment (0)