ఈద్ జరుపుకునేందుకు వచ్చిన వలస కూలీలు ఓటు వేయకుండా తిరిగి వెళ్లవద్దు !

Telugu Lo Computer
0


శ్చిమ బెంగాల్ లోని ముర్షిదాబాద్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ ఈద్ జరుపుకునేందుకు రాష్ట్రానికి వచ్చిన వలస కూలీలు ఓటు వేయకుండా తిరిగి వెళ్లొద్దని కోరారు. మీరు లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేయకుంటే కాషాయ పాలకులు మీ ఆధార్ కార్డు, పౌరసత్వాన్ని తీసేస్తారని పేర్కొన్నారు. .బెంగాల్‌లో సీఏఏను తాను ఎట్టి పరిస్థిత్తులో అమలు చేయబోనన్నారు. ఎన్ఆర్‌సీని ఇక్కడ అమలు చేసేందుకు అనుమతించనని స్పష్టం చేశారు. అస్సాంలో సీఏఏను అమలు చేస్తుండగా అక్కడ ఎంతో మంది ప్రజలు ప్రాణాలను కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. కాషాయ నేతలు ఇప్పుడు ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) గురించి మాట్లాడుతున్నారు, యూసీసీని వారు తీసుకు వస్తే ఏమవతుందో మీకు తెలుసా అని మమతా బెనర్జీ ప్రశ్నించారు. దాని వల్ల మీరు మీ గుర్తింపును కోల్పోవాల్సి వస్తుందని వెల్లడించిందిఅలాగే, ఇండియా కూటమి పార్టీలు కాంగ్రెస్‌, వామపక్షాలపై కూడా మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీతో కలిసి కాంగ్రెస్‌, వామపక్షాలు తృణమూల్‌ కాంగ్రెస్‌పై కుట్ర పన్నుతున్నాయని ఆరోపించింది. అసలు ఇండియా కూటమిని ఏర్పాటు చేసిందే తానేనని, కూటమికి ఇండియా అనే పేరు కూడా తానే పెట్టానని చెప్పారు.. ఇంత చేస్తే బెంగాల్‌లో కాంగ్రెస్‌, బీజేపీ కోసం పని చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. 'రాష్ట్రంలో బీజేపీని ఓడించాలంటే కాంగ్రెస్‌, వామపక్షాలకు ఎవరూ ఓటు వేయొద్దని మమత పిలుపునిచ్చింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)