కేజ్రీవాల్ పక్క సెల్ లలో కరడుగట్టిన నేరగాళ్ళు ?

Telugu Lo Computer
0


తీహార్ జైలులో అరవింద్ కేజ్రీవాల్ కు జైలు నెంబరు రెండును కేటాయించారు. ఏప్రిల్ 15వ తేదీ వరకు జ్యుడీషియల్ రిమాండ్ లో భాగంగా కేజ్రీవాల్ తీహార్ జైలులో ఉండనున్నారు.  ఆయన పక్క సెల్ లలో అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్, కరడుగట్టిన గ్యాంగ్ స్టర్ నీరజ్ బవానా, ఉగ్రవాది జియావుర్ రెహమాన్ ఉన్నారు. ఛోటా రాజన్ ఒకప్పుడు దావూద్ ఇబ్రహీం కు సన్నిహితుడు . దావూద్ ఇబ్రహీంకు తీవ్ర ప్రత్యర్థిగా మారడానికి ముందు సన్నిహితుడుగా ఉన్నాడు. దావూద్ ఇబ్రహీం కు చెందిన డీ కంపెనీతో విభేదించి స్వతంత్రంగా ఒక ముఠాను ఏర్పరచుకున్న ఛోటా రాజన్. కరడు కట్టిన నేరస్తుడు. చోటా రాజన్ 2018లో జర్నలిస్టు j.డే హత్య కేసులో దోషిగా నిర్ధారించబడి జీవితఖైదు అనుభవిస్తున్నారు. ప్రస్తుతం అతను కేజ్రీవాల్ పక్క సెల్లో ఉన్నారు . కేజ్రివాల్ పక్క సెల్లో ఉన్న మరొక పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ నీరజ్ బవానా, అతనిపై 40కి పైగా హత్య, హత్యాయత్నం మరియు దోపిడీ కేసులు ఉన్నాయి. అతను కూడా కేజ్రీవాల్ పక్క సెల్ లోనే ఉండడం గమనార్హం. ఇంకా కేజ్రీవాల్ సెల్ కు సమీపంలో ఉన్న మరొక సెల్ లో జియావుర్ రెహ్మాన్ ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది ఉన్నారు. తీవ్రమైన నేరాలు చేసిన ఇంతమంది ఉన్న జైలులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఉంచారు. ఇదిలా ఉంటే ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో మాజీ డిప్యూటీ సీఎం మనీషా సిసోడియా జైలు నెంబర్ ఒకటి లో ఉండగా, ఎమ్మెల్సీ కవిత మహిళా జైలులో జైలు నెంబర్ 6లో ఉన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)