రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు కేసులో ఇద్దరు కీలక నిందితుల అరెస్ట్‌ !

Telugu Lo Computer
0


బెంగళూరు లోని రామేశ్వరం కేఫ్ పేలుడు ఘటనలో కేసులో ప్రధాన నిందితులను ఎన్‌ఐఏ అరెస్ట్‌ చేసింది. కేఫ్‌ పేలుడు సూత్రధారి అబ్దుల్ మతీన్ తహాతో పాటు బాంబును అమర్చిన ముసావీర్ హుస్సేన్‌ షాజిబ్‌ను పశ్చిమబెంగాల్‌లో అరెస్ట్ చేసినట్లు ఎన్ఐఏ అధికారులు శుక్రవారం వెల్లడించారు. తూర్పు మెదీనాపూర్‌లోని కాంతి ప్రాంతంలో నిందితులను అదుపులోకి తీసుకుంది. కర్ణాటక, పశ్చిమబెంగాల్‌, తెలంగాణ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌, కేరళలోని పలు ప్రాంతాల్లో తనిఖీల తర్వాత అక్కడి పోలీసుల సాయంతో ఈ అరెస్టుల పరిణామం జరిగింది. కాగా ఈ కేసులో ప్రధాన నిందితులకు స్థానికంగా సహకరించిన ముజమ్మిల్ షరీఫ్‌ను కూడా దర్యాప్తు సంస్థ గత నెలలో అరెస్టు చేసింది. షరీఫ్, హుస్సేన్, తాహా ఈ ముగ్గురూ ఐఎస్ఐఎస్‌ మాడ్యూల్స్‌తో సంబంధం కలిగి ఉన్నట్లు ఎన్ఐఏ వర్గాలు వెల్లడించాయి. గతేడాది నవంబర్‌లో నమోదైన మంగుళూరు కుక్కర్‌ పేలుడు కేసుతో పాటు శివమొగ్గ గ్రాఫిటీ కేసులోనూ వీరి ప్రమేయం ఉన్నట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి.


Post a Comment

0Comments

Post a Comment (0)