విస్కీకి నేను పెద్ద అభిమానిని !

Telugu Lo Computer
0


సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, సీనియర్ న్యాయవాది దినేష్ ద్వివేది ల మధ్య కోర్టు హాళ్లో జరిగి సరదా సంభాషణ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.పారిశ్రామిక మద్యానికి సంబంధించి కేసును సుప్రీంకోర్టు విచారిస్తున్న సందర్భంగా ఈ హాస్యభరిత సంభాషణ జరిగినట్లు సమాచారం. ఇంటర్నెట్ లో వైరల్ గా మారిన ఆ వీడియోలో పారిశ్రామిక మద్యానికి సంబంధించిన కేసును వాదిస్తున్న సీనియర్ న్యాయవాది దినేష్ ద్వివేది ధర్మాసనాన్ని ఉద్దేశిస్తూ.. ''నా రంగురంగుల జుట్టుకు క్షమించండి. దీనికి కారణం హోలీ. ఇంట్లో చాలా మంది పిల్లలు, మనవలు, మనవరాళ్లు ఉండటం వల్ల తలెత్తే సమస్య ఇది. అలాంటప్పుడు మనమేం చేయలేం'' అన్నారు. దీనిపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్  స్పందిస్తూ, సరదాగా ''హోలీకి మద్యంతో సంబంధం లేదా?'' అని ప్రశ్నించారు. సీజేఐ ప్రశ్నకు అడ్వొకేట్ ద్వివేదీ స్పందిస్తూ.. ''హోలీ అంటే కొంతవరకు ఆల్కహాల్ అని కూడా అర్థం. నేను ఒక విషయం మీ ముందు ఒప్పుకోవాలి, నాకు విస్కీ అంటే చాలా ఇష్టం'' అని జవాబిచ్చారు. ఈ వీడియోను రెండు రోజుల క్రితం పోస్ట్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 1.5 లక్షలకు పైగా వ్యూస్ సాధించింది. దాదాపు 400 లైక్స్ రాబట్టింది. ఈ వీడియో క్లిప్ పై నెటిజన్లు కూడా సరదాగా స్పందించారు. విచారణ సందర్భంగా విస్కీపై తనకున్న అభిమానం గురించి ద్వివేది మరింత వివరించారు. ''నేను సింగిల్ మాల్ట్ విస్కీని ఇష్టపడతాను. సింగిల్ మాల్ట్ విస్కీకి మక్కా లాంటిది ఎడిన్ బర్గ్ కు ఈ మధ్య వెళ్లాను. నేను నా విస్కీ పెగ్ లో కొన్ని ఐస్ క్యూబ్స్ వేయాలనుకున్నాను. కానీ వెయిటర్ అందుకు అంగీకరించలేదు. సింగిల్ మాల్ట్ విస్కీని నీట్ (ఏం కలుపుకోకుండా) గానే తాగాలి అని చెప్పాడు. దానికి ప్రత్యేక గ్లాస్ కూడా ఉంది. ఈ విషయం నాకు మొదటిసారి తెలిసింది'' అని ద్వివేదీ వివరించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)