ఒకే ఇంటిలో నలుగురు దారుణ హత్య !

Telugu Lo Computer
0


ర్ణాటకలోని బళ్లారి, గదగ్‌ నగరంలో గురువారం అర్ధరాత్రి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు హత్యకు గురయ్యారు. హతులను నగర సభ ఉపాధ్యక్షురాలు సునంద బాకళె కుమారుడు కార్తీక్‌ బాకళె (27), పరశురామ (55), లక్ష్మీ (45), ఆకాంక్ష(16)గా గుర్తించారు. కుటుంబ సభ్యులు పైఅంతస్తులో గాఢ నిద్రలో ఉండగా దుండగులు చొరబడి వేట కొడవవళ్లతో విచక్షణా రహితంగా దాడి చేసి హత్యోదంతానికి పాల్పడ్డారు. గదిలో మృతదేహాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. దుండగుల బారి నుంచి తప్పించుకునేందుకు బాధితులు యత్నించగా వెంటాడి నరికినట్లుగా ఘటన స్థలంలో ఆనవాళ్లు కనిపించాయి. హత్య జరిగిన స్థలం రక్తం మడుగులతో భీతావహంగా ఉంది. ఇంటిలోని వస్తు సామగ్రి చెల్లాచెదురుగా పడి ఉంది. మహిళలు అనే కనికరం లేకుండా కొడవళ్లతో నరికి హత్య చేయడం నగరవాసులను కలవరపాటుకు గురి చేసింది. హత్యోదంతం కుటుంబ గొడవలతోనే జరిగినట్లు కొందరు చెబుతున్నారు. హంతకులు ఎవరు, ఏ ప్రాంతంనుంచి వచ్చారు..లోపలకు ఎలా చొరబడ్డారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జిల్లా ఎస్పీ వీఎస్‌ నేమగౌడ ఆధ్వర్యంలో క్లూస్‌టీమ్‌, డాగ్‌ స్క్వాడ్‌తో సోదాలు నిర్వహించారు. పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దుండగుల కోసం గాలింపు చేపట్టారు. మృతదేహాలను ఆస్పత్రికి తరలించి శుక్రవారం కుటుంబ సభ్యులకు అప్పగించారు. సునంద ప్రకాష్‌ బాకళె కుమారుడు కార్తీక్‌ బాకళె(27) వివాహా నిశ్చితార్థానికి కొప్పళకు చెందిన పరుశురామ్‌(55), లక్ష్మి (45) దంపతులు తమ కుమార్తె ఆకాంక్ష(17)తో కలిసి వచ్చారు. 18వ తేదీ ఉదయం వివాహ నిశ్చితార్థ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంబరాలు ముగిసిన తర్వాత బంధువులు, మిత్రులు వారి వారి ప్రాంతాలకు తరలి వెళ్లగా పరుశురామ, లక్ష్మి, ఆకాంక్ష కొప్పళకు తిరిగి వచ్చేందుకు గురువారం రాత్రి ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే బంధువుల ఒత్తిడితో కార్తీక్‌ బాకళె ఇంటిలోనే వారు బస చేశారు. కార్తీక్‌బాకళె(27)తో పాటు పైఅంతస్తులో నిద్రించారు. అర్ధరాత్రి జరిగిన హత్యోదంతంలో కార్తీక్‌ బాకళెతోపాటు పరశురామ, లక్ష్మి, ఆకాంక్షలు కూడా బలయ్యారు.

Post a Comment

0Comments

Post a Comment (0)