ఎస్బీఐ ఖాతాదారులకు పీఎం సూర్య ఘర్ యోజన పథకం కింద రుణం !

Telugu Lo Computer
0


స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పీఎం సూర్య ఘర్ యోజన ప్రయోజనాలను లబ్ధిదారులకు రుణం అందిస్తోంది. ఎస్బీఐ ఖాతాదారులు ఈ పథకం ప్రయోజనాలను పొందాలంటే మీ ఇంటి పై కప్పు పై సోలార్ రూఫ్ ఫ్యానల్స్ ను ఇన్ స్టాల్ చేసేందుకు తగినంత స్థలాన్ని కలిగి ఉండాలి. ఈ ప్యానెల్స్ ను వారి ఇంటి పై ఇన్ స్టాల్ చేసుకోవడానికి ప్రభుత్వం సబ్సిడీ కూడా అందిస్తుంది. ఈ పథకం ద్వారా ప్రభుత్వం కనీస సబ్సిడీని సోలార్ రూఫ్ ప్యానెల్ సిస్టమ్ కిలోవాట్ సామర్థ్యం ఆధారంగా చేసుకుని ఇవ్వడం జరుగుతుంది. దీనిలో భాగంగా 30 వేల వరకు ఇవ్వడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకం ద్వారా ప్రయోజనాలు పొందడానికి  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినియోగదారులు తక్కువ వడ్డీ రేటు రుణ సౌకర్యాలను అందుకుంటారు. ఇక ఈ రుణాలను పొందడం ద్వారా ప్రజలు ఖాళీగా ఉన్న ఇంటిపై సౌర పలకలను అమర్చుకోవచ్చు. 3 KW నుండి 10 KW సోలార్ ప్యానల్స్ ఇన్స్టాలేషన్ కోసం ఎస్బిఐ 10.15 % వార్షిక వడ్డీ రేటు తో 6 లక్షల వరకు రుణాన్ని అందించడం జరుగుతుంది. 60 నుండి 70 సంవత్సరాలు కలిగిన వ్యక్తులు సీనియర్ సిటిజెన్లు ఎలాంటి అదనపు చార్జీలు లేకుండానే అందిస్తున్న ఈ ప్రయోజనాల పొందవచ్చు. ఎస్బీఐ అందిస్తున్న రుణ సదుపాయం ద్వారా వ్యక్తులు సోలార్ ప్యానల్స్ ఇన్స్టాలేషన్ కోసం అవసరమైన ఆర్థిక సహాయాన్ని పొందవచ్చు. 

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)