హీరోయిన్‌ మీరా జాస్మిన్‌ తండ్రి కన్నుమూత!

Telugu Lo Computer
0


హీరోయిన్‌ మీరా జాస్మిన్‌ తండ్రి జోసెఫ్‌ ఫిలిప్‌ (83) అనారోగ్యంతో ఈరోజు కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఎర్నాకులంలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. జోసెఫ్‌ ఫిలిప్‌ భార్య పేరు ఎలియమ్మ. వీరికి సారా, జేని, జార్జ్‌, జాయ్‌, మీరా అని ఐదుగురు సంతానం. మీరా జాస్మిన్‌ అందరిలో కంటే చిన్నది. సూత్రధారన్‌ అనే మలయాళ చిత్రంతో మీరా జాస్మిన్‌ తన కెరీర్‌ ఆరంభించింది. రన్‌ సినిమాతో తమిళంలో ఎంట్రీ ఇచ్చింది. అమ్మాయి బాగుంది చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. పందెం కోడి, గుడుంబా శంకర్‌, భద్ర, రారాజు, మహారథి, యమగోల మళ్లీ మొదలైంది, గోరింటాకు, మా ఆయన చంటిపిల్లాడు.. ఇలా అనేక సినిమాలు చేసింది. 2014లో దుబాయ్‌ ఇంజనీర్‌ అనిల్‌ జాన్‌ను పెళ్లాడింది. పెళ్లి తర్వాత సినిమాల సంఖ్య తగ్గించేసిన మీర, గతేడాది విమానం చిత్రంతో తెలుగులో రీఎంట్రీ ఇచ్చింది. 

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)