రాళ్ల దాడి కేసులో A1 సతీష్‌ను నెల్లూరు సెంట్రల్‌ జైలుకు తరలింపు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ అజిత్‌సింగ్‌ నగర్‌ సమీపంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన రాళ్ల దాడికి సంబంధించి ఐదుగురు అనుమానితులను ఎన్టీఆర్‌ జిల్లా పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. సీఎం జగన్‌పై దాడి కేసులో A1గా ఉన్న సతీష్‌కు విజయవాడ సెషన్స్‌ కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. దీంతో A1 సతీష్‌ను నెల్లూరు సెంట్రల్‌ జైలుకు తరలించారు. సీఎం జగన్‌ను అంతమొందించాలన్న ఉద్దేశంతోనే దాడి చేసినట్లు రిమాండ్‌ రిపోర్ట్‌లో పోలీసులు తెలిపారు. అదును చూసి సున్నితమైన తల భాగంలోనే కుట్ర ప్రకారం దాడి చేశాడన్నారు. సీఎం జగన్‌పై ఏ2 ప్రోద్బలంతో ఏ1 దాడి చేసినట్టు రిమాండ్‌ రిపోర్ట్‌లో పోలీసులు స్పష్టం చేశారు. ఈ కేసులో ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్న దుర్గారావు పాత్ర కీలకమని పోలీసులు భావిస్తున్నారు. దుర్గారావు వెనుక ఉన్న పాత్రధారులపైనా పోలీసుల ఆరా తీస్తున్నారు. అయితే ఈ ఘటనలో రాజకీయ కుట్ర కోణం ఉందని పోలీసులు చెప్తున్నారు. ఇవాళ దుర్గారావును కోర్టులో హాజరుపర్చే అవకాశం ఉంది. కోర్టు ఇచ్చే ఆదేశానుసారం దర్యాప్తులో మరిన్ని కీలక అంశాలు వెలుగులోకి రానున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)