బీజేపీ అభ్యర్థి మాధవి లత ఆస్తులు రూ. 221.37 కోట్లు ?

Telugu Lo Computer
0


హైదరాబాద్ బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన కొంపెల్ల మాధవీ లత నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్‌లో ఆమె తన కుటుంబ ఆస్తుల వివరాలను వెల్లడించారు. తెలంగాణలోని అత్యంత ధనిక అభ్యర్థులలో ఒకరైన కొంపెల్ల మాధవి లత తన మొత్తం రూ. 221.37 కోట్ల కుటుంబ ఆస్తులను ప్రకటించారు. ఆమెతో పాటు తన భర్త కొంపెల్ల విశ్వనాథ్ ఇద్దరూ వ్యాపారవేత్తలు కాగా, వారి ముగ్గురు పిల్లలకు రూ. 165.46 కోట్ల చరాస్తులు ఉండగా, మాదవీలత దంపతులకు కలిపి రూ.55.91 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. సికింద్రాబాద్‌లో నివాసం ఉంటున్న 49 ఏళ్ల మాదవీ లత ఇటీవలే బీజేపీలో చేరి తొలిసారి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. లిస్టెడ్, అన్‌లిస్టెడ్ కంపెనీల్లో రూ.25.20 కోట్ల పెట్టుబడితో సహా రూ. 31.31 కోట్ల చరాస్తులు తనకు ఉన్నాయని ఆమె ప్రకటించారు. అంతేకాదు.. ఆమె పేరిట విరించి లిమిటెడ్‌లో రూ.7.80 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. రూ. 3.78 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు కూడా ఉన్నాయి. మాదవీలత భర్తకు విరించి లిమిటెడ్‌లో రూ.52.36 కోట్ల విలువైన షేర్లతో సహా రూ. 88.31 కోట్ల చరాస్తులు ఉన్నాయి. దంపతులపై ఆధారపడిన ముగ్గురు పిల్లలు కూడా రూ. 45 కోట్లకు పైగా మొత్తం చరాస్తులు ఉన్నాయి. బీజేపీ అభ్యర్థి మాదవీ లతకు రూ. 6.32 కోట్ల స్థిరాస్తులు ఉండగా, ఆమె భర్త స్థిరాస్తుల విలువ రూ. 49.59 కోట్లు. అయితే, ఆమెకు ఆస్తులలో హైదరాబాద్, చుట్టుపక్కల వ్యవసాయేతర భూమి,వాణిజ్య, రెసిడెన్సీ భవనాలు ఉన్నాయి. మాధవీ లతకు రూ. 90 లక్షల అప్పులు ఉండగా, ఆమె భర్త పేరిట రూ. 26.13 కోట్లు అప్పులు ఉన్నాయి. 2022-23లో ఆమె ఆదాయం రూ. 3.76 లక్షలు కాగా, 2021-22లో రూ. 1.22 కోట్లు. 2022-23లో భర్త విశ్వనాథ్ ఆదాయం రూ. 2.82 కోట్లు కాగా, 2021-22లో రూ. 6.86 కోట్లుగా ఆమె ప్రకటించారు. బీజేపీ అభ్యర్థి మాదవి లతపై ఒక క్రిమినల్ కేసు కూడా ఉంది. పొలిటికల్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసినట్టుగా ఆమె తన ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితాలో కొంపెల్ల మాధవి లతను హైదరాబాద్ బీజేపీ అభ్యర్థిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే నియోజకవర్గం నుంచి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కూడా బరిలో నిలిచారు.


Post a Comment

0Comments

Post a Comment (0)