రవిచంద్రన్‌ అశ్విన్‌ అరుదైన ఘనత

Telugu Lo Computer
0


క్రికెట్‌ ప్రపంచంలో ఏ బౌలర్‌కూ ఇంత వరకు సాధ్యం కాని ఘనతను  టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ సరికొత్త సాధించాడు. 2011లో అంతర్జాతీయ టెస్టుల్లో అడుగుపెట్టాడు. ఢిల్లీ వేదికగా వెస్టిండీస్‌తో తన తొలి టెస్టు ఆడాడు. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీసిన ఈ రైటార్మ్‌ స్పిన్నర్‌, రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లతో చెలరేగాడు. అలా తన కెరీర్‌లో తొలి ఐదు వికెట్ల హాల్‌ నమోదు చేశాడు. తాజాగా తన వందో టెస్టులోనూ ఈ ఘనత సాధించాడు అశ్విన్‌. ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లకే పరిమితమైన అశ్విన్‌,  రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల తీసి అరుదైన ఘనత సాధించాడు. 

Post a Comment

0Comments

Post a Comment (0)