గుట్టలు, కొండలు, రోడ్లు, వెంచర్ వేసిన భూములకు రైతు బంధు ఇవ్వకూడదని నిర్ణయం !

Telugu Lo Computer
0


రైతు బంధుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. గత ప్రభుత్వం ఇచ్చినట్లు గుట్టలు, కొండలు, రోడ్లు, వెంచర్ వేసిన భూములకు రైతు బంధు ఇవ్వకూడదని నిర్ణయించినట్లు ప్రటించారు. యాసంగి రైతు బంధు గతంలో ఉన్న వివరాల ప్రకారమే ఇస్తున్నామని తెలిపారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు సాయం నాలుగు నెలలలోపు కంటే తక్కువ సమయంలో ఎప్పుడూ ఇవ్వలదేని చెప్పారు. ఒక్కోసారి రైతు బంధు ఐదు నెలల పాటు పంపిణీ చేశారని గుర్తు చేశారు. రైతు బంధు రాని వారికి నెలఖారులోగా డబ్బులు జమ చేస్తామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. త్వరలోనే రైతు భరోసా తీసుకొచ్చి అర్హులకు మాత్రమే లబ్ధి చేరుకురేలా చేస్తామన్నారు. మహిళలు చిన్న వ్యాపారాలు, పరిశ్రమలు పెట్టుకోవడానికి ప్రభుత్వం తరఫున మహిళ సంఘాలకు అండగా ఉంటామని చెప్పారు. స్వయం సహాయక బృందాలను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని భట్టి ఆరోపించారు. ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాలు ఇస్తే బీఆర్ఎస్ నేతలు విరమర్శస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగులకు ఎప్పుడు ఒకటో తేదీన జీతాలు ఇవ్వలేదన్నారు. మార్చి 11న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని తీసుకొస్తామన్నారు. ప్రతి నియోజకవర్గంలో 3 వేల 500 ఇళ్లను శాంక్షన్ చేస్తామని చెప్పారు. కాగా రైతు బంధు సంబంధించి చెల్లింపులు కొనసాగుతోన్నాయి. అయితే గత కొన్నేళ్లుగా రైతు బంధు నిధులు అనర్హులకు అందాయి. దీంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం వాటిల్లింది. ముఖ్యంగా సినీ, రాజకీయ, వ్యాపారవేత్తలకు కూడా రైతు బంధు ఇచ్చారు. కానీ కౌలుకు తీసుకుని కష్టపడే రైతులకు మాత్రం రైతు బంధు ఇవ్వలేదని ఆరోపించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)