బెంగళూరుకే డబ్ల్యూపీఎల్‌ కప్ !

Telugu Lo Computer
0


ఆర్‌సీబీ అమ్మాయిలు డబ్ల్యూపీఎల్‌ రెండో సీజన్‌లోనే తమ కలను నిజం చేసుకున్నారు. ఫైనల్ చేరిన తొలిసారే ట్రోఫీ సొంతం చేసుకున్నారు. ఎలిమినేటర్‌లో ముంబై ఇండియన్స్‌ను ఓడించిన మంధాన సేన తుది పోరులో లీగ్ టాపర్‌ ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఓడించింది. సూపర్‌ బౌలింగ్‌తో డీసీని తక్కువ స్కోరుకే కట్టడి చేసిన ఆర్‌సీబీ.. చిన్న టార్గెట్‌ను జాగ్రత్తగా ఛేజ్‌ చేసింది. లీగ్ మొత్తం అదరగొట్టిన ఢిల్లీ మరోసారి ఫైనల్లో బోల్తా కొట్టింది. వరుసగా రెండోసారి రన్నరప్‌తో సరిపెట్టింది. విమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో రాయల్‌ చాలెంజర్స్ బెంగళూరు అద్భుతం చేసింది. ఫైనల్ చేరిన తొలిసారే కప్‌ ఎగురేసుకుపోయింది. శ్రేయాంక పాటిల్‌ (4/12), సోఫీ మొనులిక్స్‌ (3/20) సూపర్‌ బౌలింగ్‌కు తోడు ఛేజింగ్‌లో ఎలైస్‌ పెర్రీ (37 బాల్స్‌లో 4 ఫోర్లతో 35 నాటౌట్‌), సోఫీ డివైన్‌ (32), కెప్టెన్‌ స్మృతి మంధాన (31) మెరుగ్గా ఆడటంతో ఆదివారం జరిగిన టైటిల్‌ ఫైట్‌లో ఆర్‌సీబీ 8 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. టాస్‌ గెలిచిన ఢిల్లీ 18.3 ఓవర్లలో 113 రన్స్‌కే ఆలౌటైంది. షెఫాలీ వర్మ (27 బాల్స్‌లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 44), మెగ్‌ లానింగ్‌ (23 బాల్స్‌లో 3 ఫోర్లతో 23) రాణించగా, ఇన్నింగ్స్‌లో ఏడుగురు సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. తర్వాత బెంగళూరు 19.3 ఓవర్లలో 115/2 స్కోరు చేసి గెలిచింది. రిచా ఘోష్‌ (17 నాటౌట్‌) విన్నింగ్‌ ఫోర్‌తో ఆర్‌సీబీకి చిరస్మరణీయ విజయాన్ని అందించింది. మొనులిక్స్​కు 'ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు లభించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)