గుజరాత్‌ లో బీజేపీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా !

Telugu Lo Computer
0


లోక్‌సభ ఎన్నికలకు ముందు గుజరాత్‌ బీజేపీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే కేతన్ ఇనామ్‌దార్ తన పదవికి రాజీనామా చేశారు. వడోదర జిల్లా సావ్లి నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన తన రాజీనామా పత్రాన్ని అసెంబ్లీ స్పీకర్‌ శంకర్‌ చౌదరికి అందించారు. కేతన్‌ ఇనమాదార్‌ 2020 లోనే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే దానిని స్పీకర్ ఆమోదించలేదు. సీనియర్ ప్రభుత్వ అధికారులు, మంత్రులు తనను, తన నియోజకవర్గాన్ని విస్మరిస్తున్నారని అన్నారు. బీజేపీలో చాలా మంది ఎమ్మెల్యేలు తనలాగే నిరాశ చెందుతున్నారని ఇనామ్‌దార్ పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)