చివరి శ్వాస వరకు కేసీఆర్ వెంటే ఉంటా !

Telugu Lo Computer
0


సోషల్ మీడియా ఫ్రీగా ఉంది కాబట్టి ఇష్టమొచ్చినట్లు పుకార్లు సృష్టిస్తున్నారు.. వాళ్లు పార్టీ మారుతున్నారని, వీళ్లు పార్టీ మారుతున్నారని పుకార్లు వ్యాప్తి చేస్తున్నారని మహేశ్వరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ధ్వజమెత్తారు. మా జిల్లాలో నా కోసం ఒక మంత్రి పదవికి రిజర్వ్ చేసి పెట్టారట. నా కుమారుడు కార్తీక్ రెడ్డి చెప్పిన మాదిరిగా చివరి శ్వాస వరకు కేసీఆర్ వెంటే ఉంటామని స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశంలో సబిత పాల్గొని ప్రసంగించారుతోటి ఎమ్మెల్యేలు చేవెళ్ల చెల్లెమ్మ అన్నప్పుడల్లా నా మనసు పులకరించిపోతోంది. చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌ను గెలిపించి కేసీఆర్‌కు కానుకగా ఇద్దాం. గత 20 ఏండ్ల నుంచి మిమ్మల్ని చూస్తున్నాను. ప్రతిపక్షంలో ఉండి ఎలా పోరాటం చేయాలో మీకు అందరికీ తెలుసు. ప్రజల కోసం పని చేయాలి. ఈ ఎన్నికల్లో మన పార్లమెంట్ ఏరియాలో ఏమన్న ఇబ్బంది ఉంటే చెప్పండి.. పరుగెత్తుకువస్తాం. కేసులకు భయపడేది లేదు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో చిన్న తట్టు తాకింది.. దాంతో వెనక్కి వెళ్లాల్సిన అసవరం లేదు. గట్టిగా పని చేసి కాసానిని గెలిపించి, కేసీఆర్ రుణం తీర్చుకుందాం. విశ్వేశ్వర్ రెడ్డి, రంజిత్ రెడ్డి ఎవరో మనకు తెలియకపోయినా కేసీఆర్ పంపించారు.. మనం గెలిపించాం. అంతో ఇంతో కాసాని మనతో మమేకమై పని చేస్తూ వస్తున్నారు. ఈ రోజు బడుగుల గొంతుక పార్లమెంట్‌లో వినిపించాలంటే ఆయనను గెలిపించాలి. కార్యకర్తల శక్తి ఏంటో ఇప్పుడు చూపించాలి. కేసీఆర్ అంటే ఏంటి..? కేసీఆర్ సైన్యం ఏంటో చూపించాలి. మాకు వచ్చిన మెజార్టీ కంటే కాసానికి డబుల్ మెజార్టీ రావాలి. ఇవాళ పార్టీ మారుతున్న వారంతా మానవత్వం లేని వారు అని సబిత ఆగ్రహం వ్యక్తం చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)