షుగర్ క్రేవింగ్స్ తగ్గాలంటే ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి ?

Telugu Lo Computer
0


ధుమేహం వ్యాధి ఎక్కువగా ఉన్నప్పుడు తీపి ఎక్కువగా తినాలన్న కోరిక సాధారణంగా పుడుతుంది. అయితే ఇలా తినడం వల్ల షుగర్ లెవల్స్ అనేవి ఖచ్చితంగా విపరీతంగా పెరిగిపోతాయి. అలాగే సాధారణంగా కూడా కొంత మందికి షుగర్ క్రేవింగ్స్ అనేవి ఉంటాయి. అప్పుడు వెంటనే స్వీట్లు తినాలని అనిపిస్తుంది. అయితే ఇలాంటివి తినడం వల్ల ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదట. అలా తింటే షుగర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకా అంతే కాకుండా ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రతి రోజూ కొన్ని రకాల ఆహార పదార్థాలు తినడం వల్ల షుగర్ క్రేవింగ్స్ ఈజీగా తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సాధారణ చాక్లెట్ల కంటే కూడా డార్క్ చాక్లెట్లు తింటే చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇవి తింటే ఒత్తిడి, ఆందోళన వంటివి కంట్రోల్ అవడమే కాకుండా భావోద్వేగాలు కూడా అదుపులో ఉంటాయి. ఇంకా అంతే కాకుడా తీపి తినాలన్న కోరికలను కూడా తగ్గిస్తుంది. ఇంకా దాల్చిన చెక్క, అవకాడో, నట్స్ వంటివి వాటిని తిన్నా కూడా షుగర్ క్రేవింగ్స్ తగ్గుతాయి.ప్రతి రోజూ కప్పు పెరుగు తినడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులో ప్రోటీన్లు, ప్రోబయోటిక్స్ అనేవి మెండుగా ఉంటాయి. పెరుగు తినడం వల్ల చక్కెర తినాలన్న కోరికలు చాలా వరకూ తగ్గుతాయి. పెరుగులో ఒక స్పూన్ తేనె కలుపుకుని తింటే ఇంకా మంచిది. అలాగే ఫ్రెష్ ఫ్రూట్స్ కూడా వేసుకుని తిన్నా బెటరే. పెరుగును క్రమం తప్పకుండా తీసుకుంటే.. చర్మం, జుట్టు సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.ప్రస్తుతం మార్కెట్లో బెర్రీల జాతికి సంబంధించి ఎన్నో రకాల పండ్లు లభిస్తున్నాయి. స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్, రాస్బ్రీస్ ఇలా చాలా రకాలు ఉంటున్నాయి. వీటిల్లో ఏదో ఒకటి తరచూ మీ డైట్‌లో చేర్చుకోవడం వల్ల షుగర్ క్రేవింగ్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. అంతేకాకుండా ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి. ఇందులో క్యాలరీలు కూడా తక్కువగా ఉంటాయి. ఇవి తింటే రక్తంలో చక్కెర స్థాయిలు కూడా తగ్గుతాయి. ఇవి తరచూ తింటే వెయిట్ లాస్ కూడా అవుతారు.

Post a Comment

0Comments

Post a Comment (0)