టాటా కార్లు అంటే అలా వుంటాయి మరి !

Telugu Lo Computer
0


భారతదేశానికి ఉత్తరాన ఉన్న హిమాలయ ప్రాంతం ఎంతో చల్లగా ఉంటుంది. ఇక్కడున్న అందమైన ప్రదేశాలను చూసేందుకు నిత్యం ప్రజలు వెళ్తుంటారు. అయితే ఇక్కడి ప్రయాణం చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ముఖ్యంగా పర్వతాల మధ్య ఉండే రోడ్లపై వాహనాల్లో వెళాల్సి ఉంటుంది. ఈ వాహనం అదుపు తప్పితే లోయలో పడాల్సి వస్తుంది. అందువల్ల ఇక్కడ చాలా జాగ్రత్తగా ప్రయాణించాలి. ఇక వర్షాల సమయంలో మరీ ప్రమాదం. ఈ సమయంలో కొండచరియలు విరిగిపడుతూ ఉంటాయి. ఎటువైపు నుంచి ఏ విధంగా బండరాయి వచ్చి మీదపడుతుందో తెలియని పరిస్థితి. అయితే కొన్ని రోజుల కింద ఓ కుటుంబం కారులో ఇలాంటి కొండ ప్రాంతాల్లో ప్రయాణించింది. అయితే ఒక్కసారిగా పైనుంచి వచ్చిన పెద్ద బండరాయి కారుపై పడింది. దీంతో ఆ కారు నుజ్జునుజ్జయింది. వెనుక ఉన్న వారు ఈ కారుపై పడిన బండరాయితో అందులో ఉన్న వారు మరణించారని అనుకున్నారు. కానీ అందులో నుంచి ప్రయాణికులు ఏమాత్రం చిన్న గాయం లేకుండా బయటకు రావడం ఆశ్చర్యాన్ని కలిగిచింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిని ఆ కారు కంపెనీ క్యాచ్ చేసుకుంది. ఎందుకంటే అంతపెద్ద బండరాయి పడినా కారు నుజ్జునుజ్జయినా ప్రయాణికులు మాత్రం సురక్షితంగా ఉన్నారు. ఈ సందర్భంగా ఆ కంపెనీ వారు ఈ వీడియో షేర్ చేస్తూ 'కొండ చరియ మీదపడ్డా.. టాటా కార్లు అంటే అలా వుంటాయి.. మరీ'.. అని క్యాప్షన్ పెట్టారు. మొత్తానికి టాటా కార్లకు రక్షణ ఎక్కువగా ఉందని ఆ కంపెనీ వాళ్లు ప్రచారం చేసుకుంటున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)