డ్రగ్స్‌ కేసులో తమిళ సినీ నిర్మాత జాఫర్‌ సాదిక్‌ అరెస్టు

Telugu Lo Computer
0


అంతర్జాతీయ స్థాయిలో డ్రగ్స్‌ను అక్రమంగా రవాణా చేస్తున్న ఆరోపణలపై తమిళ సినీ నిర్మాత, డీఎంకే మాజీ సభ్యుడు జాఫర్‌ సాదిక్‌ను నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో అరెస్ట్‌ చేసింది. రూ. 2000 కోట్ల డ్రగ్స్‌ రాకెట్‌లో ఆయన ప్రమేయం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ డ్రగ్స్‌ నెట్‌వర్క్‌ భారతదేశం, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా, మలేషియాలకు విస్తరించినట్లు పోలీసులు తెలిపారు. కొద్దిరోజుల క్రితం తమిళనాడులో భారీ ఎత్తున డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్న కేసులో అరెస్టు చేసిన వారిని విచారిస్తే ఈ అంతర్జాతీయ డ్రగ్స్‌ దందా బయటపడింది. వీరి వెనుక జాఫర్‌ సాదిక్‌ ఉన్నట్లు తేలడంతో ఆయనపై అరెస్ట్‌ వారెంట్‌ జారీ అయింది. దీంతో తాజాగా ఆయన్ను అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. సాదిక్‌ తమిళనాడులోని అధికార డీఎంకే పార్టీకి చెందిన వ్యక్తి. డీఎంకే ఎన్‌ఆర్‌ఐ విభాగానికి చెందని ఆఫీస్‌ బేరర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డ్రగ్స్‌ ఆరోపణలు వచ్చిన వెంటనే ఆయన్ను పార్టీ నుంచి తొలగించడం జరిగింది. కోలీవుడ్‌లో ఆయన ఇప్పటి వరకు నాలుగు సినిమాలు నిర్మించాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)