నా భార్యను చంపాను, నన్ను అరెస్ట్ చేయండి!

Telugu Lo Computer
0


త్తరప్రదేశ్ లోని ఘజియాబాద్‌లో హౌసింగ్ కాలనీలోని అద్దె ఫ్లాట్‌లో 55 ఏళ్ల వ్యక్తి భార్యను హత్య చేసి, నాలుగు రోజుల పాటు శవాన్ని ఇంట్లోనే ఉంచాడు. ఇంట్లో నుంచి భరించలేదని దుర్వాసన రావడంతో నిందితుడు భరత్ సింగ్ ఇంటి ముందు కూర్చుని తన భార్యను చంపినట్లు కేకలు వేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తన పొరుగింటి వారితో తన భార్యను చంపేశానని, పోలీసులను పిలవాలని నిందితుడు కోరాడు. బాధితురాలని 51 ఏళ్ల సునీతగా గుర్తించారు. భరత్ సింగ్ తన భార్య గొంతుకోసి హత్య చేశాడని, ఇరుగుపొరుగు వారు తమకు సమాచారం అందించారని పోలీస్ అధికారి నరేష్ కుమార్ తెలిపారు. హత్య జరిగి కనీసం మూడు రోజులైందని అతను చెప్పాడు. కుటుంబ సమస్యపై జరిగిన గొడవల్లో భార్యను హత్య చేశాడని, మహిళ కుటుంబ సభ్యులకు సమాచారం అందించి మృతదేహాన్ని శవపరీక్షకు పంపించామని విచారణ జరుపుతున్నామని ఆయన తెలిపారు. భరత్ సింగ్ తన భార్యను చంపేసినట్లు స్వయంగా చెప్పే వరకు తమకు ఈ విషయం తెలియదని పొరుగువారు చెప్పారు. పక్కింటిలో ఉండే వ్యక్తికి తన భార్యను చంపేసినట్లు భరత్ సింగ్ చెప్పాడని, ఏం జరిగిందో తెలియదు కానీ, ''నా భార్యను చంపాను, నన్ను అరెస్ట్ చేయండి'' అని అరిచాడని అతను చెప్పాడు. 

Post a Comment

0Comments

Post a Comment (0)