సిటిజన్‌షిప్‌ అమెండ్‌మెంట్‌ యాక్ట్ పై స్టే విధించండి!

Telugu Lo Computer
0


కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన సిటిజన్‌షిప్‌ అమెండ్‌మెంట్‌ యాక్ట్ పై స్టే విధించాలని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు.తన పిటిషన్‌పై విచారణ పెండింగ్‌లో ఉండగా సీఏఏ ప్రకారం కొత్తగా ఎవరికీ భారత పౌరసత్వం ఇవ్వవద్దని ఒవైసీ సర్వోన్నత న్యాయస్తానాన్ని కోరారు. 2019లో పార్లమెంటులో ఆమోదింపజేసుకున్న పౌరసత్వ సవరణ చట్టాన్ని కేంద్రం సర్కారు ఇటీవల అమల్లోకి తీసుకొచ్చింది.ఈ కొత్త చట్టం ప్రకారం పాకిస్తాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌, బంగ్లాదేశ్‌ తదితర పొరుగు దేశాల నుంచి డిసెంబర్‌ 31, 2014 కంటే ముందు భారత్‌లోకి శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు ఇక్కడి పౌరసత్వం ఇస్తారు. సీఏఏ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకున్న కొందరికి ఇప్పటికే భారత పౌరసత్వం కల్పించారు. ఈ నేపథ్యంలో ఆ చట్టం అమలుపే స్టే విధించాలని ఒవైసీ సుప్రీంకోర్టుకు వెళ్లారు.

Post a Comment

0Comments

Post a Comment (0)