సెల్‌ఫోన్ ఫ్లాష్‌తో క్యాన్సర్ గుర్తింపు ?

Telugu Lo Computer
0


ఇంగ్లాండ్ లోని కెంట్‌లో గిల్లింగ్‌హామ్‌ పట్టణంలో ఉన్న సారా హెడ్జెస్ స్మార్ట్‌ఫోన్ ఫ్లాష్‌ని ఉపయోగించి తన కుమారుడు బాధపడుతున్న అరుదైన క్యాన్సర్‌ను గుర్తించింది. ఈమెకు నలుగురి పిల్లలున్నాయి. అయితే నవంబర్ 2022లో ఒక సాయంత్రం వంట తయారీలో భాగంగా షెపర్డ్ ఫ్రై చేస్తుండగా ఆమె చూపు మూడు  నెలల కొడుకు థామస్ పడింది. అతని కంటిలో ఒక విచిత్రమైన “తెల్లని మెరుపు”ను గమనించింది. ఆందోళనతో ఆమె తన స్మార్ట్‌ఫోన్‌ను పట్టుకుని, దాని ఫ్లాష్‌ను ఉపయోగించి ఫొటోలు తీసింది. ఆ ఫోటోలను నిషితంగా గమనించగా కంట్లో తెల్లగా ఉన్నట్లు కనుగొంది. ఈ పరిస్థితిని మరింతం తెలుసుకోవడానికి ఇంటర్నెట్ సాయంతో సెర్చ్ చేసింది. కంట్లో కాంతి వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించాలని నిర్ణయించుకున్న సారా మరుసటి రోజు సొంత ప్రయోగాన్ని నిర్వహించింది. ఆమె థామస్‌ను వివిధ గదుల చుట్టూ తిప్పి, వివిధ కాంతి పరిస్థితుల్లో అతనిని నిశితంగా గమనించగా వింత కాంతి మళ్లీ కనిపించింది. తన అన్వేషణలపై ఆందోళన చెంది సమాధానాల కోసం ఇంటర్నెట్‌ని ఆశ్రయించింది. శోధన ఫలితాల్లో ఇది క్యాన్సర్ అని తేలింది. దీంతో ఆమె వెంటనే వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లగా ఆయన ఇంకో ఆస్పత్రికి రిఫర్ చేశాడు. అక్కడ ఆమె అనుమానించినట్టుగానే కొడుకు థామస్ కంటి క్యాన్సర్‌తో బాధపడుతున్నాడని తేలింది. అత్యంత తీవ్రమైన రెటినోబ్లాస్టోమా థామస్ బాధపడుతున్నట్లు వైద్యులు నిర్ధారించారు. నవంబర్ 2022లో ఆరు కఠినమైన కీమోథెరపీలతో క్యాన్సర్‌ ట్రీట్‌మెంట్‌ను వైద్యులు ప్రారంబించారు. థామస్ తన చివరి కీమోథెరపీ సెషన్‌ను ఏప్రిల్ 6, 2023న పూర్తి కాగా క్యాన్సర్ బారి నుంచి బయటపడ్డాడని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం థామస్ మందులు వాడుతున్నా, సంతోషంగా కుటుంబంతో గడుపుతున్నాడు. ముఖ్యంగా అతని తల్లి సారా అప్రమత్తత థామస్‌ను కాపాడింది. చైల్డ్‌హుడ్ ఐ క్యాన్సర్ ట్రస్ట్ వంటి సంస్థలు చిన్నారుల కంట్లో తెల్లటి మెరుపు వంటి సూక్ష్మ సంకేతాలను గుర్తిస్తే అప్రమత్తం అవ్వాలని సూచిస్తున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)