కోలీవుడ్ నటుడు డేనియల్ బాలాజీ కన్నుమూత

Telugu Lo Computer
0


కోలీవుడ్ నటుడు డేనియల్ బాలాజీ (48) కన్నుమూశాడు. శుక్రవారం అర్థరాత్రి గుండెపోటుతో అతడు తుదిశ్వాస విడిచాడు. ఛాతినొప్పితో తీవ్ర అస్వస్థతకు గురైన డేనియల్ బాలాజీని కుటుంబసభ్యులు చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. హాస్పిటల్‌కు తరలించేలోపే అతడు మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించినట్లు సమాచారం. డేనియల్ బాలాజీ తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడలో యాభైకిపైగా సినిమాలు చేశాడు. ఎక్కువగా విలన్ రోల్స్‌లోనే కనిపించాడు. చిట్టి అనే తమిళ సీరియల్‌తో డేనియల్ బాలాజీ యాక్టింగ్ కెరీర్ మొదలైంది. పిన్ని పేరుతో తెలుగులో డబ్ అయిన ఈ సీరియల్ ఇక్కడ కూడా పాపులర్‌గా అయ్యింది. ఆ తర్వాత ఏప్రిల్ మదాతిల్, కాదల్ కొండెన్ సినిమాల్లో చిన్న రోల్స్ చేశాడు.

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)