బెంగాల్‌లో 42 స్థానాలకు టీఎంసీ అభ్యర్థులను ప్రకటన !

Telugu Lo Computer
0


శ్చిమ బెంగాల్‌లో అధికార టీఎంసీ సమర శంఖాన్ని పూరించింది. 'ఇండియా' కూటమిలో భాగమైనప్పటికీ రాష్ట్రంలో ఒంటరిగానే బరిలోకి దిగుతున్నట్లు సీఎం మమతా బెనర్జీ తెలిపారు. మొత్తం 42 స్థానాలకుగానూ అభ్యర్థులను ప్రకటించారు. కోల్‌కతా వేదికగా ఆదివారం పార్టీ ప్రచారానికి శ్రీకారం చుట్టారు. బహరామ్‌పుర్‌ నుంచి మాజీ క్రికెటర్‌ యూసుఫ్‌ పఠాన్‌ బరిలో దిగనున్నారు. అవినీతి ఆరోపణలపై పార్లమెంటు సభ్యత్వం కోల్పోయిన మహువా మొయిత్రాకు మరోసారి కృష్ణానగర్‌ నుంచి అవకాశం కల్పించారు. ఎనిమిది మంది సిటింగ్‌లను పక్కకు తప్పించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఒక స్థానం నుంచి పోటీకిగానూ సమాజ్‌వాదీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌తో చర్చలు జరుపుతున్నట్లు మమతా తెలిపారు. అస్సాం, మేఘాలయాలోనూ పోటీ చేస్తామన్నారు. రాష్ట్రంపై ఆరోపణలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీడీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ''నేను న్యాయ వ్యవస్థను గౌరవిస్తాను. కానీ, కొంతమంది భాజపా ఏజెంట్లుగా పనిచేశారు'' అని ఇటీవల భాజపాలో చేరిన కలకత్తా హైకోర్టు మాజీ న్యాయమూర్తి అభిజిత్ గంగోపాధ్యాయపై విరుచుకుపడ్డారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)