రైతుబంధు అడిగినోన్ని చెప్పుతో కొట్టమంటావా ?

Telugu Lo Computer
0


చలో నల్లగొండ సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగిస్తూ ఈ రాష్ట్రానికి మేం చేసిన కాడికి చేశాం. ఫలితం చూశాం. ఒకనాడు ఏడ్సిన తెలంగాణ, నేడు మూడు కోట్ల టన్నుల వడ్లు పండించింది. రైతుబంధు ఇవ్వడానికి కూడా చేతనైత లేదు. ఇంత దద్దమ్మలా..? రైతుబందు కూడా ఇవ్వరా..? అన్నదాతలను పట్టుకుని రైతుబంధు అడిగినోన్ని చెప్పుతో కొట్టమంటావా..? ఎన్ని గుండెల్రా మీకు..? ఎట్ల మాట్లాడుతారు.. కండకావరమా..? కండ్లు నెత్తికి వచ్చినాయా..? ప్రజలను అలా అనొచ్చా..? ఒక్క మాట చెబుతున్నా జాగ్రత్త.. నోటి దరుసుతో మాట్లాడేటోళ్లరా… చెప్పులు పంటలు పండించే రైతులకు కూడా ఉంటాయి. రైతుల చెప్పులు ఎట్ల ఉంటయి.. బందోబస్తుగా ఉంటాయి.. గట్టిగా ఉంటయి.. ఒక్కటే చెప్పు దెబ్బతో మూడు పళ్లు ఊసిపోతాయి. దానికోసమేనా మీరు అడిగేది. ఇది మర్యాదనా.. గౌరవమా..? ప్రజలను గౌరవించే పద్ధతా..? చేతకాకపోతే జర తర్వాత ఇస్తా.. లేదంటే మాకు చేయొస్తే లేదు అని చెప్పాలి. కానీ అడిగినోని చెప్పుతో కొట్టాలి అని అంటారా..? అని కేసీఆర్ అన్నారు. కేసీఆర్ చలో నల్లగొండ అంటే కేసీఆర్‌ను తిరగనివ్వం అని అంటరు. ఇంత మొగోళ్లా..? కేసీఆర్‌ను తిరగనివ్వరంట.. తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌నే తిరగనివ్వరా..? ఏం చేస్తరు చంపేస్తరా..? దా.? చంపుతావా ఏపాటి చంపుతావో దా..? కేసీఆర్‌ను చంపి మీరు ఉంటారా.. ఇది పద్దతా.. ప్రతిపక్ష పార్టీ తప్పకుండా ప్రజల తరపున వస్తది. ప్రజల మధ్య అడుగుతది. మీకు దమ్ముంటే మేం చేసిన దానికంటే మంచిగా చేసి చూపియ్. కరెంట్ మంచిగా ఇచ్చి చూపియ్.. ఆగమాగం కావొద్దు. పాలమూరు ఎత్తిపోతల పూర్తి చేయాలి. దాని గురించి మాటలేదు. ఖమ్మంలో సీతారామ పూర్తి చేయాలి. దాని గురించి ముచ్చట లేదు. గురుకులాలు ఎక్కువ పెట్టాలి.. ఆ ముచ్చట లేదు. కరెంట్ మంచిగా ఇవ్వాలి.. ఆ ముచ్చట లేదు. ఇవన్నీ మాయం చేసి బలాదూర్‌గా తిరుగుదాం అనుకుంటున్నారా..? తిరగనివ్వం జాగ్రత్త అని చెబుతున్నాం. తప్పక నిలదీస్తాం. ఎండగడుతాం అని కేసీఆర్ హెచ్చరించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)