ఉచిత విద్యుత్ కోసం 'రూఫ్‌టాప్ సోలార్ స్కీమ్'

Telugu Lo Computer
0


సామాన్యులపై విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం 'రూఫ్‌టాప్ సోలార్ స్కీమ్'ను ప్రకటించింది. ఇంటి పైకప్పులపై సోలార్ ప్యానెళ్ల ఏర్పాటును ప్రోత్సహించే దిశగా చేపట్టిన ఈ కార్యక్రమానికి 'పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజిలీ యోజన' అని పేరు పెట్టినట్టు ప్రధాని తెలిపారు. ఈ స్కీమ్ కింద రూ.75 వేల కోట్ల పెట్టుబడితో ప్రతి నెలా 300 యూనిట్ల వరకు దేశవ్యాప్తంగా ఉచిత విద్యుత్ అందించడం ద్వారా కోటి కుటుంబాల్లో వెలుగులు నింపాలని లక్ష్యంగా పెట్టుకుందని మోడీ ట్విట్టర్ (X) వేదికగా వెల్లడించారు. ఈ పథకాన్ని పొందడానికి pmsuryaghar.gov.in అనే వెబ్‌సైట్‌ విజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ సైట్లోనే ఉచిత విద్యుత్ కోసం అప్లయ్ చేసుకోవాలి. 

Post a Comment

0Comments

Post a Comment (0)