జార్ఖండ్‌లో ప్రభుత్వాన్ని దొంగలించేందుకు బీజేపీ ప్రయత్నించింది !

Telugu Lo Computer
0


జార్ఖండ్ లోకి భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రవేశించింది. ఈ సందర్భంగా  కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ  జార్ఖండ్‌లో ప్రభుత్వాన్ని దొంగిలించేందుకు బీజేపీ ప్రయత్నించిందని ఆరోపించారు. శనివారం జార్ఖండ్ రాష్ట్రంలోని గొడ్డా జిల్లాలోకి జోడో యాత్ర ప్రవేశించింది. రాష్ట్రంలో జేఎంఎం సంకీర్ణ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ రక్షించిందని అన్నారు. శనివారం డియోఘర్‌లోని ప్రసిద్ధ బాబా బైద్యనాథ్ థామ్ వద్ద ప్రార్థనలు చేశారు. అక్కడే ర్యాలీలో ప్రసంగించారు. జనవరి 14న మణిపూర్‌లో ప్రారంభమైన యాత్ర శుక్రవారం మధ్యాహ్నం పశ్చిమ బెంగాల్ నుంచి పాకూర్ జిల్లా మీదుగా రాష్ట్రంలోకి ప్రవేశించింది. మొత్తంగా 67 రోజుల్లో 6,713 కిలోమీటర్లు ప్రయాణించి, 15 రాష్ట్రాల్లోని 110 జిల్లాల మీదుగా మార్చి 20న ముంబైలో యాత్ర ముగియనుంది.


Post a Comment

0Comments

Post a Comment (0)