తల్లితో కలిసుండటం ఇష్టంలేక బాలిక ఆత్మహత్య !

Telugu Lo Computer
0


త్తరప్రదేశ్‌ లోని మీరట్‌ పట్టణంలో తల్లితో కలిసుండటం ఇష్టంలేక బాలిక ఆత్మహత్య చేసుకుంది. భర్త చనిపోయిన ఓ మహిళ తన 17 ఏళ్ల కుమార్తె, 8 ఏళ్ల కుమారుడితో కలిసి మీరట్‌లోని ఓ అద్దె ఇంట్లో ఉంటోంది. ఇదివరకు వేరే ఇంట్లో ఉన్న ఆ కుటుంబం గత నెల 8న ఇప్పుడున్న ఇంట్లోకి మారింది. ఈ క్రమంలో తల్లి, తమ్ముడు ఇంట్లో లేని సమయం చూసి బాలిక ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు తల్లి ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు పాల్పడిన బాలిక చాలాకాలంగా తన తమ్ముడితో కలిసి ముజఫర్‌నగర్‌లోని మేనత్త ఇంట్లో ఉండేది. అయితే 2020లో ఓ యువకుడు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అప్పట్లో ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి జైలుకు పంపించారు. అయితే ఇటీవల ఆ బాలిక తల్లి ఆమెను, ఆమె తమ్ముడిని మేనత్త ఇంటి నుంచి బలవంతంగా తీసుకొచ్చిందని, తాను మేనత్త దగ్గరే ఉంటానని చెప్పినా తల్లి వినిపించుకోలేదని పోలీసుల విచారణలో తేలింది. దాంతో తల్లి దగ్గర ఉండటం ఇష్టం లేకనే బాలిక ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)