బ్రేక్ దర్శనం భక్తులకు ఎస్ఎంఎస్ పే సిస్టమ్‌

Telugu Lo Computer
0


తిరుమల శ్రీవారి దర్శనం కోసం విచక్షణ కోటాలో కేటాయించే బ్రేక్ దర్శనం టికెట్లు పొందే భక్తుల సౌకర్యార్థం టీటీడీ నూతనంగా ఎస్ఎంఎస్ పే సిస్టమ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఫిబ్రవరి నుండి ఈ విధానాన్ని అమలుచేస్తోంది. నూతన విధానంలో ఎస్ఎంఎస్ ద్వారా పే లింక్‌ను పంపుతారు. భక్తులు ఆ లింక్ పైన క్లిక్ చేసి యూపీఐ లేదా క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ద్వారా ఆన్లైన్‌లో సొమ్ము చెల్లించి ఎంబీసీ-34 కౌంటర్ వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా బ్రేక్ దర్శన టికెట్లు ప్రింట్ తీసుకోవచ్చు. ఇప్పటికే ఆఫ్‌లైన్‌లో సీఆర్ఓలో లక్కీడిప్ ద్వారా ఆర్జిత సేవాటికెట్లు పొందుతున్న భక్తులకు ఈ విధానం అమలు చేస్తున్నారు. ఈ విధానంపై భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గంటల తరబడి క్యూలైన్‌లో వేచి ఉండే అవసరం లేకుండా టీటీడీ కొత్తగా ప్రవేశపెట్టిన ఎస్ఎంఎస్ పే సిస్టమ్ చాలా బాగుంది అంటున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)