మారుతి సుజుకి ఫ్లయింగ్ కార్స్ ?

Telugu Lo Computer
0


మారుతి సుజుకి జపాన్ పేరెంట్ సంస్థ సుజుకితో కలిసి 'ఎలక్ట్రిక్ ఎయిర్ కాప్టర్లు' డెవలప్ చేయడానికి ప్రణాళిక రూపొందిస్తున్నది. ఈ 'ఎలక్ట్రిక్ ఎయిర్ కాప్టర్'లో పైలట్‌తోపాటు ముగ్గురు ప్రయాణికులు ప్రయాణం చేయొచ్చు. డ్రోన్ల కంటే పెద్దగా, సంప్రదాయ హెలికాప్టర్ల కంటే చిన్నగా ఈ 'ఎలక్ట్రిక్ ఎయిర్ కాప్టర్'లు ఉంటాయి. సంప్రదాయ హెలికాప్టర్ కంటే సగం తక్కువ బరువు అంటే 1.4టన్నుల బరువు ఉంటుందీ ఎలక్ట్రిక్ ఎయిర్ కాప్టర్. తక్కువ బరువు ఉండటం వల్ల ఇండ్ల పైకప్పు మీద వీటిని టేకాఫ్, ల్యాండింగ్ చేయొచ్చు. కస్టమర్లకు న్యూ మొబిలిటీ సొల్యూషన్స్ అందించడమే లక్ష్యంగా మారుతి సుజుకి ఈ 'ఎలక్ట్రిక్ ఎయిర్ కాప్టర్' రూపొందించే పనిలో పడింది. తొలుత జపాన్, అటుపై అమెరికా, భారత్ మార్కెట్లోకి ఎలక్ట్రిక్ ఎయిర్ కాప్టర్'లను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. రోడ్డు మార్గంలో ఉబెర్, ఓలా క్యాబ్ సర్వీసుల మాదిరిగానే మారుతి సుజుకి 'ఎలక్ట్రిక్ ఎయిర్ కాప్టర్'లు ఎయిర్ టాక్సీలుగా వినియోగిస్తారు. ఈ ప్రక్రియ విజయవంతమైతే ప్రజా రవాణాలో విప్లవాత్మక మార్పులు వస్తాయని భావిస్తున్నారు. దేశీయ మార్కెట్లోకి ఎలక్ట్రిక్ ఎయిర్ కాప్టర్'లు తేవడంతోపాటు తక్కువ తయారీ ఖర్చుతో భారత్ లోనే వీటిని తయారు చేయడానికి ఆసక్తి చూపుతున్నది. భారత్‌లో వినియోగానికి గల అవకాశాలు, వాస్తవిక పరిస్థితులను అధ్యయనం చేసేందుకు అనుమతించాలని కోరుతూ విమానయాన రంగ నియంత్రణ సంస్థ 'డీజీసీఏ'తో సంప్రదిస్తున్నట్లు సుజుకి మోటార్ గ్లోబల్ ఆటోమొబైల్ ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ అసిస్టెంట్ మేనేజర్ కెంటో ఒగురా చెప్పారు. మారుతి సుజుకి తన ఎలక్ట్రిక్ ఎయిర్ కాప్టర్'కు 'స్కై డ్రైవ్' అని పేరు పెట్టనున్నది. 12 యూనిట్ల మోటార్లు, రూటర్లతో 2025-ఒసాక ఎక్స్ పోలో వీటిని ప్రదర్శించనున్నది. తొలుత జపాన్, అమెరికాలో విక్రయించనున్నది. కానీ మేక్ ఇన్ ఇండియా' ఇన్సియేటివ్‌లో భాగంగా భారత్'కు ఈ ఎలక్ట్రిక్ ఎయిర్ కాప్టర్ తయారీ టెక్నాలజీని తీసుకు రానున్నది. ఈ ఎలక్ట్రిక్ ఎయిర్ కాప్టర్ విద్యుద్ధీకరించడంతో అందులో వినియోగించే విడి భాగాలు గణనీయంగా తగ్గుతాయి. తయారీ ఖర్చు, నిర్వహణ ఖర్చు కూడా తగ్గుతుందని ఓ ఆంగ్లదినపత్రిక ఒక వార్తా కథనం ప్రచురించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)