ఓపెన్‌ హైమర్‌ కు బ్రిటిష్‌ అకాడమీ ఫిల్మ్‌ అవార్డుల పంట !

Telugu Lo Computer
0


ఇంగ్లాండ్ లోని లండన్‌లో రాయల్‌ ఫెస్టివల్‌ హాల్‌లో 77వ బ్రిటిష్‌ అకాడమీ ఫిల్మ్‌ అవార్డుల ప్రదానోత్సవం ఆదివారం అట్టహాసంగా జరిగింది. ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన బయోగ్రాఫికల్ మూవీ 'ఓపెన్‌హైమర్' చిత్రం ఈ అవార్డుల్లోనూ సత్తా చాటింది. ఉత్తమ చిత్రంతో పాటు ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడితో పాటు మొత్తం ఏడు విభాగాల్లో ఈ సినిమాకు అవార్డులు దక్కాయి. కాగా క్రిస్టోఫర్ నోలన్‌కు దర్శకుడిగా ఇదే తొలి బ్రిటిష్‌ అకాడమీ ఫిల్మ్‌అవార్డు కావడం విశేషం. ఇప్పటికే అత్యధిక గోల్డెన్ గ్లోబ్ అవార్డులను దక్కించుకున్న ఈ సినిమా వచ్చే నెల మార్చిలో జరగనున్న ఆస్కార్ రేసులో తన ప్లేస్‌ను మరింత సుస్థిరం చేసుకుంది. కాగా 'పూర్ థింగ్స్‌'కు ఐదు, 'ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్'కు మూడు అవార్డులు దక్కాయి. 'ది జోన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌'కు మూడు పురస్కారాలు దక్కాయి.


Post a Comment

0Comments

Post a Comment (0)