నాకు డాన్స్ లో చిరంజీవి ఇన్స్పిరేషన్ !

Telugu Lo Computer
0


చిరంజీవి డాన్స్ టీవీలో వస్తుంటే ప్రభుదేవా ఆ డాన్స్ ని చూపిస్తూ ఏంటి ఆ గ్రేస్ అని చూపిస్తూ  మెగా మెగా మెగాస్టార్ డాన్స్ అండ్ వర్కవుట్ సూపర్ నాకు డాన్స్ లో ఇన్స్పిరేషన్ చిరంజీవి అనే క్యాప్షన్ పెట్టాడు.ఇప్పుడు ప్రభుదేవా చేసిన ఈ ట్వీట్ తో మెగా ఫ్యాన్స్ ఆనందం అయితే మాములుగా లేదు.ఇక ప్రభుదేవా చూపించే వీడియోలో చిరు ఠాగూర్ సినిమాలోని మన్మధ మన్మధ సాంగ్ కి చేసిన వీణ స్టెప్ ప్లే అవుతుంది. ఇప్పడు ఈ పిక్ సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ లో ఉంది. ప్రభుదేవా చిరు కాంబోలో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఆయా సినిమాల్లోని చిరు డాన్స్ కి థియేటర్స్ దద్దరిల్లిపోయేవి. ఆ సాంగ్స్ లోని స్టెప్ లు తెలుగు సినిమా రంగంలో డాన్సింగ్ విషయంలో కొత్త ఒరవడిని కూడా సృష్టించాయి.అలాగే డాన్సుల్లో చిరు చేసే ఎన్నో మేనరిజమ్స్ ని నేటికీ చిరు ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా చేస్తుంటారు. ఘరానా మొగుడు సినిమాలోని బంగారు కోడి పెట్ట సాంగ్ స్టెప్స్ నే అందుకు ఒక ఉదాహరణ. 

Post a Comment

0Comments

Post a Comment (0)