వచ్చే వారం బీజేపీ అభ్యర్థుల మొదటి జాబితా ?

Telugu Lo Computer
0


బీజేపీ వంద మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను ఫిబ్రవరి 29న విడుదల చేయడానికి కసరత్తు చేస్తోందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ జాబితాలో బీజేపీ అగ్రనేతలు కూడా ఉంటారు. ప్రధాని మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పేర్లు ఈ లిస్టులో ఉండనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం గురువారం జరగగనుండగా.. ఆ మీటింగ్‌లోనే జాబితా విడుదల చేయనున్నారు. దేశవ్యాప్తంగా 543 లోక్ సభ స్థానాలకుగానూ 370 స్థానాల్లో గెలుపొందాలని బీజేపీ లక్ష్యం నిర్దేశించుకుంది. మొత్తంగా ఎన్డీఏ కూటమి 400 స్థానాల్లో గెలుపుబావుటా ఎగరేయాలని బీజేపీ భావిస్తోంది. ఇందులో భాగంగా దాదాపు 100 స్థానాల్లో గెలుపు గుర్రాలను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ప్రధాని మోడీ వారణాసి నుంచి రెండు సార్లు ఎంపీగా గెలిచారు. 2014లో 3.37 లక్షల ఓట్లతో, 2019లో 4.8 లక్షల భారీ ఆధిక్యంతో గెలుపొందారు. అమిత్ షా 2019 ఎన్నికల్లో గాంధీనగర్ నుంచి పోటీ చేశారు. ఇటీవల జరిగిన బీజేపీ నేతల సమావేశంలో మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ గెలుపు కోసం ప్రతిఒక్కరు కష్టపడాలని.. రాబోయే 100 రోజులు కీలకమని చెప్పారు. ఈ సమయంలో ప్రతి లబ్ధిదారుడికి, ఓటరుకు చేరువ కావాలని సూచించారు. తాను మూడోసారి ప్రధాని కావాలని పని చేయట్లేదని.. దేశం కోసం పని చేయాలనుకుంటున్నట్లు మోడీ అన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)