రైల్వే టికెట్ కౌంటర్‌ వద్ద డిజిటల్‌ చెల్లింపులు ?

Telugu Lo Computer
0


ఇండియన్‌ రైల్వేస్‌ కూడా డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించే దిశగా అడుగులు వేసింది. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేస్తూ వస్తున్న ఇండియన్‌ రైల్వేస్‌ తాజాగా డిజిటల్‌ చెల్లింపులను స్వీకరిస్తూ మరో కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణంగా రైల్వే స్టేషన్‌లో టికెట్ కౌంటర్‌ వద్ద డబ్బుల విషయంలో ఇబ్బందులు పడడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చిల్లర విషయంలో ప్రతీ ఒక్కరం ఏదో ఒక సమయంలో ఇబ్బంది ఎదుర్కొని ఉంటాం. అయితే ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకే ఇండియన్‌ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రైల్వే స్టేషన్స్‌లో ఉండే టికెట్‌ కౌంటర్ల వద్ద డిజిటల్‌ చెల్లింపులను స్వీకరించనున్నారు. సాధారణంగా రైల్వే టికెట్స్‌ను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునే సమయంలో క్రెడిట్, డెబిట్ కార్డులు మొదలు ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌, యూపీఐ సేవల ద్వారా టికెట్ బుక్‌ చేసుకునే అవకాశం ఉంది. అయితే రైల్వేస్టేషన్స్‌లో టికెట్ కౌంటర్స్‌ వద్ద మాత్రం కచ్చితంగా నగదు రూపంలో డబ్బు చెల్లించాల్సిందే. దీంతో చిల్లర సమస్య తలెత్తడం సర్వసాధారణం. ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకే ఇండియన్‌ రైల్వేస్‌ ఇకపై టికెట్ కౌంటర్ల వద్ద యూపీఐ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. కేవలం యూపీఐ మాత్రమే కాకుండా డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డులతో కూడా పేమెంట్ చేసుకునే వెసులుబాటు కల్పించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)