నల్లుల్ని నివారించే ఇంటి చిట్కాలు !

Telugu Lo Computer
0


ల్లులు (బెడ్ బగ్స్) అనేవి మన ఇంటిలో వస్తువులు, బట్టలు, ఫర్నీచర్ ద్వారా చాలా సులభంగా వ్యాపిస్తాయి. వీటి కారణంగా అలర్జీ, చర్మంపై దద్దుర్లు వంటి సమస్యలు వస్తాయి. వీటిని తొలగించుకోవటానికి ఇంటి చిట్కాలు చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. లవంగాలు బగ్స్ ని తరిమి కొట్టటానికి చాలా సమర్ధవంతంగా పని చేస్తాయి. ఒక స్ప్రే బాటిల్ లో ఒక స్పూన్ లవంగాల పొడి, గోరువెచ్చని నీటిని పోసి బాగా కలిపి బగ్స్ ఉన్న ప్రదేశంలో స్ప్రే చేయాలి. అలా చేస్తూ ఉంటె క్రమంగా బగ్స్ బారి నుండి బయట పడవచ్చు. టీ ట్రీ ఆయిల్ కూడా బగ్స్ నివారణలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. నీటిలో టీ ట్రీ ఆయిల్ ని కలిపి నల్లులు ఉన్న ప్రదేశంలో స్ప్రే చేస్తే సరిపోతుంది. తాజా పుదీనా ఆకులను మంచం, దిండు కింద ఉంచితే బెడ్ బగ్స్ బెడద తగ్గుతుంది. నీటిలో బేకింగ్ సోడా కలిపి నల్లులు ఉన్న ప్రదేశంలో స్ప్రే చేస్తే బగ్స్ ఉదృతి తగ్గుతుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)