అధిక బరువు తగ్గడానికి రివర్స్ వాకింగ్‌ ?

Telugu Lo Computer
0


ప్రతికూల జీవన శైలి, ఆహారపు అలవాట్లలో మార్పులు ఒబేసిటీ, అధిక బరువు పెరగడానికి  దోహదం చేస్తుంటాయి. అయితే వాటిని సానుకూలంగా మార్చుకోవడం, తగిన వ్యాయామాలు చేయడం సమస్యను అధిగమించడంలో సహాయపడతాయి. ముఖ్యంగా రివర్స్ వాకింగ్ మోస్ట్ ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందని ఫిట్‌నెస్ నిపుణులు చెప్తున్నారు. రోజూ కాసేపు వెనక్కి నడిచే అలవాటుతో మూడు నెలల్లో 30 కిలోల బరువు తగ్గే ఛాన్స్ ఉందని యూఎస్ కేంద్రంగా నిర్వహించిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. కొందరు అధిక బరువు తగ్గాలని రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. వివిధ ఆహారాలకు, జిమ్‌లో ప్రత్యేక వర్కవుట్లకు ఖర్చు పెడుతుంటారు. కానీ అలాంటివేమీ చేయకుండానే జస్ట్ రివర్స్ వాకింగ్ ద్వారా బరువు తగ్గవచ్చు. కాకపోతే దీనికోసం రెగ్యులర్‌గా ఒకే సమయం ఫిక్స్ చేసుకోవాలి. కొన్ని రోజులు చేయగానే మధ్యలో ఒకటి రెండు రోజులు ఆపి వేయడం, తిరిగి మళ్లీ మొదలు పెట్టడం వంటివి చేయకూడదు. ఎందుకంటే మధ్యలో గ్యాప్ ఇవ్వకుండా రోజూ అరగంట నుంచి 40 నిమిషాలు చేసే రివర్స్ వాకింగ్ వల్ల మాత్రమే 7 రోజుల్లోనే కనీసం 3 కిలోలు బరువు తగ్గే అవకాశం ఉంటుంది. ఈ లెక్కన మూడు నెలల్లోనే 30 కేజీలు ఈగా తగ్గవచ్చు. కాకపోతే వెనక్కి నడవడం అనేది సాధారణంకంటే స్పీడ్‌గా ఉండాలి. అప్పుడే మంచి ఫలితం ఉంటుంది. దీంతోపాటు శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగు పడుతుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. మెమోరీ పవర్ పెరిగే చాన్స్ ఉంటుంది. హై బ్లడ్ ప్రెజర్, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తలెత్తకుండా ఉంటాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)