ఫిబ్రవరి మొదటి వారంలో మరో రెండు గ్యారెంటీలు ?

Telugu Lo Computer
0


తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫిబ్రవరి మొదటి వారంలో మరో రెండు గ్యారెంటీలను అమలు చేయాలని కసరత్తు మొదలు పెట్టింది. రూ.500కు వంట గ్యాస్, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్‌లను అమలు చేయాలనుకుంటుంది .ఈ రెండు గ్యారెంటీలను అమలు చేసేందుకు సన్నద్ధం కావాలని సీఎం రేవంత్ ఇప్పటికే ఆయా శాఖలకు ఆదేశాలిచ్చినట్లు తెలిసింది. మహాలక్ష్మి గ్యారెంటీలోని మూడు అంశాల్లో ఒకటైన రూ.500 లకే గ్యాస్ సిలిండర్‌ను, గృహజ్యోతిలోని ప్రతి కుటుంబానికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్‌ను అందజేయనున్నారు. సర్కార్ ఆదేశాలతో సివిల్ సప్లై శాఖ, విద్యుత్ శాఖలు ఈ రెండు హామీల అమలుకు ప్రణాళికలు తయారు చేస్తున్నారు. లబ్ధిదారులను ఎలా ఎంపిక చేయాలి..? ఎవరెవరికి సబ్సిడీ గ్యాస్ అందించాలి..? సెంట్రల్ గవర్నమెంట్ అందజేసే ఉజ్వల్ సిలిండర్లు ఎంత మందికి అందుతున్నాయి? వంటి వివరాలను సివిల్ సప్లై శాఖ తరువుగా అధ్యయనం చేస్తోన్నది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒకటి రెండు రోజుల్లో రూ.500 లకే గ్యాస్ సిలిండర్ హామీ అమలుపై ఓ నివేదికను కూడా అందజేస్తామని ఓ అధికారి తెలిపారు. ఉచిత విద్యుత్‌తో ఎంత ఖర్చు వెచ్చించాల్సి ఉంటుంది..? ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్లాలి? అర్హులను ఎలా గుర్తించాలనే దానిపై కూడా విద్యుత్ శాఖ రిపోర్టు తయారు చేస్తున్నట్లు తెలిసింది. ప్రజలకు హామీ ఇచ్చినట్లే వంద రోజుల్లో ఆరు గ్యారెటీలను అమలు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. దీనిలో భాగంగా ఫిబ్రవరి నెలలో గ్యాస్, ఉచిత పవర్‌ను ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలిసింది. దీంతో గృహజ్యోతి గ్యారెంటీ సంపూర్ణంగా పూర్తి కానుండగా, మహలక్ష్మి గ్యారెంటీలో రెండు అంశాలు క్లియర్ అవుతాయి. మహిళలకు ప్రతి నెలా రూ.2500 అంశాన్ని అమలు చేస్తే ఆ గ్యారెంటీ కూడా పూర్తిగా అమల్లోకి వస్తుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)