ఎయిర్ ఇండియా విమానంలో విరిగిన సీట్లు, పనిచేయని రీడింగ్ లైట్లు ?

Telugu Lo Computer
0


ఢిల్లీ నుంచి టోరంటో వెళ్లే సమయంలో ఎయిరిండియా విమానంలో తనకు ఎదురైన అసౌకర్యంపై ప్రయాణికురాలు అసంతృప్తిని వ్యక్తం చేశారు. టిక్కెట్ల కోసం చాలా ఎక్కువ ధర చెల్లించినప్పటికీ విమానంలో సౌకర్యాలు తక్కువగా ఉన్నాయిని ఆరోపించింది. దీనికి సంబంధించిన వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇద్దరు పిల్లలతో కలిసి టోరంటోకు ఎయిర్ ఇండియా విమానంలో వెళ్తున్న ప్రయాణికురాలు శ్రేయతి గార్గ్ ఈ వీడియో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని రికార్డు చేసి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. విమానంలో సీట్లు విరిగిపోయి ఉన్నాయని, మూడు సీట్లకు లైట్లు పనిచేయడం లేదని దీంతో తన ఇద్దరు పిల్లలతో తాను చీకటిలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. అంతేకాదు విరిగిన సీటు వల్ల తన బిడ్డకు ప్రమాదం తప్పిందని, సీస్టమ్ నుంచి వైర్లు బయటికొచ్చాయని సిబ్బందికి అనేక మార్లు చెప్పినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని గార్గ్ చెప్పారు. సిబ్బంది సిస్టమ్ ను రీబూట్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ సమస్య అలాగే ఉండిపోయిందన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎయిర్ ఇండియా నుంచి ఎలాంటి ప్రతిస్పందన లేకపోవడంపై చాలామంది నెటిజన్లు తీవ్ర ఆందోళన, అసంతృప్తిని వ్యక్తం చేశారు. కొంత మంది నెటిజన్లు ఎయిర్ ఇండియాలో టిక్కెట్ ధరలపై ప్రశ్నించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)