ఏప్రిల్‌ దర్శనం టికెట్లు విడుదల

Telugu Lo Computer
0


తిరుమలలో శ్రీవారి భక్తులకు ఏప్రిల్‌ నెల దర్శనం టికెట్లు, వసతి గదుల కోటాను, అంగప్రదక్షిణ టోకెన్లను టీటీడీ విడుదల చేసింది. సీనియర్‌ సిటిజన్లు, వికలాంగుల కోటా టికెట్లు కూడా మధ్యాహ్నం విడుదలయ్యాయి. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లను బుధవారం ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నది. ఈ మేరకు భక్తులు ttdevasthanams.gov.in వెబ్‌సైట్‌లో టికెట్లను బుక్‌ చేసుకోవాలని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. గురువారం రామకృష్ణ తీర్థ ముక్కోటి సందర్భంగా తిరుమలలో ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే భక్తులను టీటీడీ అనుమతించనున్నది. అదేరోజు పుష్యమాస పౌర్ణమి గరుడసేవ ఉంటుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)