పెరిగిన బంగారం ధర !

Telugu Lo Computer
0


అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా దేశీయ బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. కొన్ని నగరాల్లో బంగారం ధర రూ.64 వేల మార్కును దాటేసింది. తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారెట్స్ బంగారం తులం ధర రూ.250 పెరిగి రూ.58,700లకు చేరుకోగా, 24 క్యారెట్స్ బంగారం తులం ధర రూ.280 పుంజుకుని రూ.64,040 వద్ద స్థిర పడింది. ఢిల్లీలో తులం బంగారం (24 క్యారెట్స్) ధర రూ.150 పెరిగి రూ.63,550 వద్ద స్థిర పడిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ తెలిపింది. ఇంతకుముందు సెషన్‌లో తులం బంగారం ధర రూ.63,400 వద్ద ముగిసింది. మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో తులం బంగారం ఫిబ్రవరి డెలివరీ ధర రూ.188 పెరిగి రూ.62,550 పలికింది. మరోవైపు కిలో వెండి ధర రూ.300 పెరిగి రూ.76,700 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 2055 డాలర్లు పలికితే, ఔన్స్ వెండి ధర 23.20 డాలర్ల వద్ద స్థిర పడింది. యూఎస్ ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ (పీపీఐ) డేటా బలహీన పడటంతోపాటు మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలతో బంగారానికి గిరాకీ పెరిగిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమొడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. గ్లోబల్ మార్కెట్లలో న్యూయార్క్‌లో ఔన్స్ గోల్డ్ ఫ్యూచర్స్ ధర 0.34 శాతం పెరిగి 2058.50 డాలర్లు పలికింది. హైదరాబాద్‌, బెంగళూరు, కోల్‌కతా, ముంబై నగరాల్లో ఆభరణాల తయారీలో వినియోగించే 22 క్యారెట్స్ బంగారం తులం ధర రూ.150 పెరిగి రూ.58,150, 24 క్యారెట్స్ బంగారం పది గ్రాములు రూ.170 పుంజుకుని రూ.63,440 వద్ద స్థిర పడింది.

Post a Comment

0Comments

Post a Comment (0)