ఎర్ర చీమల పచ్చడికి జీఐ ట్యాగ్ !

Telugu Lo Computer
0


ఎర్ర చీమల పచ్చడి గిరిజనులకు ఎంతో ముఖ్యమైన వంటకం. ఇప్పటికీ ఆదివాసుల్లో ప్రధాన వంటకంగా ఉంటుంది. నాగరికతకు అలవాటు పడిన మనకు ఇది కొద్దిగా కొత్తగా అనిపించవచ్చు. ఒడిశాలోని 'ఎర్ర చీమల పచ్చడి'కి భౌగోళిక గుర్తింపు లభించింది. ఈ వంటకంలో అనేక పోషక విలువలు ఉన్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలో ఎర్రచీమలతో చట్నీ చేస్తారు. తాజాగా దీనికి జీఐ ట్యాగ్ లభించింది. ఈ వంటకంలో ఔషధ గుణాలతో, అనేక హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ పచ్చడిని నీళ్లతో కూడిన సెమీ-సాలిడ్ పేస్ట్‌ లాగా తయారు చేస్తారు. దీనిని స్థానికంగా 'కై చట్నీ' అని పిలుస్తారు. జనవరి 2న ఈ విచిత్రమైన వంటకానికి భౌగోళిక గుర్తింపు లభించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)