బంగారంపై భారీగా సుంకం పెంచుతూ నోటిఫికేషన్‌ జారీ !

Telugu Lo Computer
0


బంగారం, వెండి దిగుతులపై కేంద్రం భారీగా సుంకాన్ని పెంచుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. బంగారు, వెండి నాణేలకూ ఇది వర్తిస్తుంది. దిగుమతి చేసుకునే బంగారం, వెండి దిగుమతులపై ఇప్పుడు వసూలు చేస్తోన్న ఇంపోర్ట్ డ్యూటీని 15 శాతం మేర పెంచింది. ప్రస్తుతం అమల్లో ఉన్న సుంకం కంటే అదనంగా 15 శాతాన్ని చెల్లించాల్సి ఉంటుంది. తక్షణమే ఈ ఉత్తర్వులు అమలులోకి వచ్చినట్లు వెల్లడించింది. మూడు రోజులుగా స్థిరంగా ఉంటూ వచ్చిన బంగారం ధర ఈ ఉదయం నుంచీ ఎగబాకుతోంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో ఈ ఉదయం 10:05 నిమిషాలకు నమోదైన ట్రేడింగ్ ప్రకారం.. 0.12 శాతం మేర ఈ పెరుగుదల కనిపించింది. 10 గ్రాముల ధర 61,964 రూపాయలుగా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్‌లో చోటు చేసుకున్న పరిణామాలే దీనికి కారణమని బులియన్ మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తోన్నాయి. రూపాయితో అమెరికన్ డాలర్ విలువ క్షీణించడం వల్ల బంగారం ధరలో స్వల్పంగా పెరుగుదల చోటు చేసుకుందని అంచనా వేస్తోన్నాయి.ఈ పరిణామాల మధ్య ఇప్పుడిక కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని భారీగా పెంచడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనివల్ల మున్ముందు పసిడి రేటు మరింత పరుగులు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)