మహానది బేసిన్ బ్లాక్‌లో రెండు గ్యాస్ నిల్వలు

Telugu Lo Computer
0


బంగాళాఖాతంలోని మహానది బేసిన్‌లో రెండు చోట్ల పెద్ద మొత్తంలో సహజవాయు నిల్వలను చమురు, సహజవాయువుల సంస్థ (ఒఎన్‌జిసి) కనుగొనింది. 2019లో ప్రభుత్వం ఓపెన్ ఏకరేజ్ లైసెన్సింగ్ విధానంలో భాగంగా జరిపిన మూడవ బహిరంగ వేలంలో దక్కించుకున్న ఎంఎన్ డిడబ్యుల్య హెచ్‌పి 2018/1 బ్లాక్‌లో ఒఎన్‌జిసి ఈ సహజవాయు నిల్వలను కనుగొనింది. జాతీయ భద్రతా కారణాల దృష్టా గతంలో' నో గో' (ఎలాంటి అన్వేషణలు జరపకూడని) ఏరియాగా వర్గీకరించిన ప్రాంతంలోనే ఒఎన్‌జిసి ఈ నిల్వలను కనుగొనడం గమనార్హం. ఉక్తల్‌గా పిలవబడే తొలి అన్వేషణ నీటిలోపల714 మీటర్ల లోతులో కనుగొనబడింది. ప్రాథమిక టెస్టింగ్ సమయంలో రోజుకు 3 లక్షల ఘనపు మీటర్లకన్నా ఎక్కువ గ్యాస్ ప్రవాహాన్ని కలిగి ఉంది. ఇక రెండోది నీటిలోపల 1100మీటర్ల లోతులో కనుగొనబడింది. ఒన్‌జిసి ఈ విషయాన్ని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రో కార్బన్స్ (డిజిహెచ్)కు తెలియజేసింది. అలాగే ఇప్పుడు వాణిజ్యపరంగా లాభదాయకమా కాదా అనే విషయాన్ని అంచనా వేసే ప్రక్రియను చేపట్టింది.

Post a Comment

0Comments

Post a Comment (0)