ధోతీ ధరించిన ఎస్పీజీ కమాండోలు !

Telugu Lo Computer
0


ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల కేరళలో పర్యటించారు. ఇందులో భాగంగా ఈ నెల 17న గురువాయూర్ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మోడీతోపాటు ఆయన వెంట ఉన్న భద్రతా సిబ్బంది కూడా ఆ ఆలయం సంప్రదాయాలను పాటించారు. గురువాయూర్‌ ఆలయంలోకి ప్రవేశించే భక్తులు విధిగా ధోతి, పై పంచె  ధరించాలి. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ఆ ఆచారాన్ని పాటించారు. ధోతి ధరించడంతోపాటు పై పంచె కప్పుకున్నారు. మరోవైపు ఎప్పుడూ నలుపు లేదా నీలం డ్రెస్‌లో కనిపించే ఎస్పీజీ కమాండోలు ధోతీలు ధరించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. దీంతో నెటిజన్లు భిన్నంగా స్పందించారు. ఎస్పీజీ కమాండోలు పంచెకట్టులో చాలా బాగున్నారని కొందరు ప్రశంసించారు. ప్రతి ఆలయంలో కూడా డ్రెస్‌ కోడ్‌ అమలు చేయాలని మరికొందరు సూచించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)