ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తున్న ఎంపీలు తమను తాము ఆత్మపరిశీలన చేసుకోవాలి !

Telugu Lo Computer
0


పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు మీడియాతో మాట్లాడుతూ  ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తున్న ఎంపీలు తమను తాము ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. ఈసారి జరిగే బడ్జెట్ సమావేశాల వల్ల లాభం చేకూరుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో పాజిటివ్ సమాచారాన్ని ఇచ్చిన ఎంపీలను ఎప్పటికీ అందరూ గుర్తు ఉంచుకుంటారన్నారు. సభా సమావేశాలను అడ్డుకునేవాళ్లను ఎవరూ గుర్తుంచుకోరన్నారు. బడ్జెట్ సమావేశాల్లో పాజిటివ్ అంశాలను ప్రప్తావించే వారిని ప్రజలు గుర్తుంచుకుంటారన్నారు. ఫిబ్రవరి 9వ తేదీన బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి ఒకటో తేదీన బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్లీ పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు ఆయన తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)