అమెరికా సైనికుల మరణానికి ప్రతీకారం తప్పదు !

Telugu Lo Computer
0


జోర్డాన్‌లో అమెరికా సైనికుల మరణానికి ప్రతీకారం తప్పదని అధ్యక్షుడు బైడెన్‌పునరుద్ఘాటించారు. అందుకు కారణమైన వారిపై ఎలా దాడిలో చేయాలో నిర్ణయించామని మంగళవారం వెల్లడించారు. దాని కోసం ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు. అయితే, పశ్చిమాసియాలో యుద్ధాన్ని మరింత విస్తరించే ఉద్దేశం మాత్రం తమకు లేదని స్పష్టం చేశారు. ఇరాన్‌ మద్దతున్న ఏ ఉగ్రసంస్థ ఈ దాడికి పాల్పడిందో ఇంకా ధృవీకరించుకోవాల్సిన అవసరం ఉందని అమెరికా రక్షణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే ప్రతీకార దాడులు చేయడానికి ఉన్న ప్రత్యామ్నాయాలనూ పెంటగాన్‌ సమీక్షిస్తోందని వెల్లడించారు. బైడెన్ మాత్రం ఇప్పటికే ఎలా దాడి చేయాలో నిర్ణయించామని ప్రకటించడం గమనార్హం. మరోవైపు తమ ప్రతిస్పందన దశలవారీగా ఉంటుందని జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి జాన్‌ కిర్బీ వెల్లడించారు. కొంత కాలం పాటు వరుస దాడులు ఉంటాయని చెప్పారు. మరణించిన సైనికుల కుటుంబాలను బైడెన్‌ పరామర్శించారని తెలిపారు.


Post a Comment

0Comments

Post a Comment (0)