అయోధ్యకు తిరుమల నుంచి లక్ష లడ్డూలు

Telugu Lo Computer
0

యోధ్యలో జనవరి 22న రామమందిర ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్ఠాపనను చూసేందుకు వచ్చే భక్తులకు శ్రీవారి లడ్డూలను ప్రసాదంగా అందజేయనున్నట్టు టీటీడీ ప్రకటించింది. ఈ విషయాన్ని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి వెల్లడించారు.ప్రత్యేకంగా తయారుచేయించిన లక్ష లడ్డూలను అయోధ్యకు పంపుతున్నట్టు ఈవో వెల్లడించారు. ఈ ఒక్కో లడ్డూ 25 గ్రాములు ఉంటుందని ఆయన చెప్పారు. సాధారణంగా తిరుమలలో భక్తులకు విక్రయించే లడ్డూలు 75 గ్రాములు ఉండగా అయోధ్య కోసం 25 గ్రాముల ఉండే లక్ష లడ్డూలను శ్రీవారి ప్రసాదంగా అందిచనున్నట్టు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)